డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి
చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి
చేగుంట, జూన్ 26: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని , డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డీ పిలుపునిచ్చారు.చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో బాగoగా పట్టణ కేంద్రం లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదకద్రవ్యాల నిర్మూలనపై (యాంటీ డ్రగ్స్) ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మాదకద్రవ్యాల,అలవాటు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు.
పట్టణం లో ఎవరైనా గంజాయి, లేదా ఇతర నిషేధిత డ్రగ్స్ విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ఎర్ర యాదగిరి, బలేష్, అక్బర్, నరేష్, జీవన్ ఎల్లేష్,స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, యువత పాల్గొన్నారు.






