పెద్దగూడెంలో మిన్నంటిన మొహర్రం సంబరాలు
భక్తిశ్రద్ధలతో పీర్ల ఊరేగింపు
వనపర్తి మండలం, జూన్ 26: వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో మొహరం పండుగను గ్రామంలోని ప్రజలు ఘనంగా నిర్వహించారు. పీర్ల పండుగకు జనం పెద్ద ఎత్తున పాల్గొని పీర్ల దేవుళ్ళ ఆశీస్సులు తీసుకున్నారు.
మొహరం పండుగలో భాగంగా పెద్దగూడెం గ్రామంలో గల సయ్యద్ హజ్రత్ బురాన్ వలి దర్గా దగ్గర పెద్దగూడెం చుట్టుముట్టు గ్రామ ప్రజలు మరియు హైదరాబాద్ నుండి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చి దర్గాను దర్శించుకుని దర్గాలో ఉన్న సయ్యద్ హజరత్ బురాన్ వలి స్వామికి మలీజు సమర్పించుకొని అక్కడ ఉన్న బురాన్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బురాన్ షా స్వామి మాట్లాడుతూ దర్గా దగ్గరికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు మరియు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు.
మొహరం పండుగను దర్గా దగ్గర పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రజలు పాల్గొని నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. మొహరం పండుగ చివరి రోజు దర్గా దగ్గర వచ్చిన భక్తులు కోళ్లతో, పొట్టేళ్లతో దర్గా దగ్గర పూజలు నిర్వహించారని తెలిపారు. ప్రతి సంవత్సరం భక్తుల యొక్క కోరికలు వాళ్ళ మొక్కులు తీరడంతో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూ ఉందని సయ్యద్ హజరత్ బురాన్ వలి స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని బురాన్ స్వామి దేవుని ప్రార్థిస్తున్నానని తెలిపారు.






