4 July, 2026 | 2:50 AM

ఓటరు జాబితాపై అప్రమత్తంగా ఉంటూ అర్హులను తొలగించకుండా చూడాలి

04-07-2026 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం అసిఫాబాద్,జూలై 3(విజయ క్రాంతి): ఓటరు జాబితాపై బీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించి అర్హులను తొలగించకుండా చూడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి సూచించారు. తిర్యాణి మండల కేం ద్రంలో శుక్రవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా కొనసాగు తున్న ఇంటింటి ఓటరు గణనపై బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు, నాయకులు, బీఎల్‌ఏలతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించా రు.

కార్యక్రమం అమలు విధానం, ఓటరు న మోదు ప్రక్రియపై బీఎల్‌ఏలకు తగు సూచనలు చేస్తూ పలు సందేహాలను నివృత్తి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ జాబితా నుండి చనిపోయిన వారి ఓట్లను తొలగించేలా చూడాలని అన్నారు. రెండు చోట్ల ఓటు హక్కు కలిగిన వారు జిల్లా వ్యాప్తంగా ఉన్నారని, వీరి వల్ల గెలిచే వ్యక్తులు ఓడిపోయే అవకాశం ఉం టుందని పేర్కొన్నారు. ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొలగించేలా చూడాలని సూచించారు.

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి మినహాయించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.పార్టీ అధికారంలో లేకు న్నా వెంట ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతం కో సం నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో పని చేయాలని పిలుపునిచ్చారు. మంగీ, గుండాల రోడ్లు తీవ్ర వర్షాల కారణంగా పూ ర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి తాత్కాలిక మరమ్మత్తులు చేయనున్నట్లు తెలిపారు.

‘మ న ప్రాంతం మన అభివృద్ధి’ కింద సింగరేణి మంజూరు చేస్తున్న నిధుల మళ్లింపుపై త్వరలోనే ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ధ ర్నాకు తిర్యాణి మండలం నుంచి భారీ సం ఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అం తకుముందు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గాయెంగి మల్లేశ్ను, అలాగే ప్రమాదవశాత్తు కాలు విరిగి చికిత్స పొందుతున్న మాజీ జె డ్పీటీసీ ఆత్రం చంద్రశేఖర్ను పరామర్శించా రు.

అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, అధికారులతో కలిసి 28 మంది లబ్ధిదారులకు చెక్కు లు అందజేశారు. అలాగే కపాస్ కాంతి పథ కం కింద 200 మంది రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జన్మాండ్ల జగదీశ్, పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ వర్మ, ఉపాధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, కా ర్యకర్తలు ముత్యం రాజయ్య, కాసం రాజ య్య, హన్నాం శంకరయ్య, కిలిశెట్టి శంకర య్య, బుర్ర మధూకర్, పుల్లూరి శ్యాం, ఆ యా గ్రామాల సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.