2 July, 2026 | 11:31 AM

Breaking News

ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •  

పనిలో పరమాత్మతత్వం అలవర్చుకోవాలి

18-12-2025 12:51 AM

క్రిస్మస్ వేడుకల్లో సంపంగి గ్రూప్స్ చైర్మన్ రమేష్ సంపంగి

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ప్రపంచానికి ప్రేమ, త్యాగం నేర్పిన క్రీస్తును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జూబ్లీహిల్స్ సంపంగి గ్రూప్స్ కార్యాల యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో చైర్మన్ రమేష్ సంపంగి, సీఈవో సురేష్ సంపంగి అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు బ హుమతులు, చాక్లెట్లు పంచి వేడుకలు నిర్వహించారు.

తాము చేస్తున్న పనిలో పారదర్శకత, నిజాయతీ ఉంటే పరమాత్ముడి తత్వా న్ని అన్వయించుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుంది అని అన్నారు. సంపంగి గ్రూప్స్‌లో పనిచేసే ప్రతి ఉద్యోగితో కలిసి కుల మత భేదం లేకుండా ప్రతి పండుగను ప్రతీ సంవత్సరం అత్యంత వైభవంగా చేసుకోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. వ్యాపారం ఒక్కటే కాకుండా సంపంగి గ్రూప్స్ ఎన్నో సేవా కార్యక్రమాల ను నిర్వహిస్తుందన్నారు.