11 April, 2026 | 2:04 PM

న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం.. బిర్యానీ తిని ఒకరు మృతి

01-01-2026 11:01 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నూతన సంవత్స వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. బిర్యానీ(Biryani) తిని ఒకరు మృతి చెందారు. మద్యం తాగిన అనంతరం బిర్యానీ తిన్న 16 మంది అస్వస్థతకు లోనయ్యారు. అందులో పాండు (53) అనే వ్యక్తి మృతి చెందాడు. అపస్మారస్థితిలోకి వెళ్లిన 15 మందికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా జగద్గరిగుట్ట పోలీస్ స్టేషన్(Jagadgirigutta Police Station) పరిధిలోని భవానీనగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో 17 మంది వ్యక్తులు పాల్గొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.