బీసీ రాజ్యం ఏర్పడ్డాక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రామాయంపేట మే 18 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యం ఏర్పడ్డ తర్వాత ఈ డబుల్ ఎస్ రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించి ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తామని తెలియజేస్తున్నాము. 40 సంవత్సరాల నుండి బీసీ రిజర్వేషన్లు కావాలని పోరాటం చేస్తుంటే బీసీ పోరాటాన్ని గుర్తించక ! ఎవరు అడగని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకవచ్చి బీసీలను దేశంలో నిండా ముంచిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
తమిళనాడు రాష్ట్రంలో ఏ విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పక్కకు పెట్టారో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయకుండా పక్కకు పెట్టాలని కోరుతున్నాము. బీసీ లందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఉదాహరణకు ఒక బీసీ బిడ్డకు 150 మార్కులు వచ్చిన జాబు రాదు. అదే ఒక ఓసి బిడ్డకు 80 మార్కులు వచ్చిన జాబులు వస్తున్నాయి అదేంటి అని అడిగితే అదే ఈ డబుల్ ఎస్ రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు.. బీసీ నిరుద్యోగులు బీసీ విద్యార్థులు బీసీ ప్రజలు ఈడబ్ల్యూఎస్ గురించి తెలుసుకోవాలి దానిపై పోరాటం చేయాలి రద్దు చేసే వరకు పోరాటం ఆపద్దు అని తెలియజేస్తున్నాను.
ఆరు శాతం లేని ఓసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు అని అడుగుతున్నాను ఈ రిజర్వేషన్లపై బీసీ సంఘాలతోని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ డబుల్ ఎస్ రిజర్వేషన్లపై చైతన్యవంతులు చేసే విధంగా పోరాటం సాగిస్తామని తెలియజేస్తున్నాను. అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులారా ఒక్కసారి ఈ విషయం ఆలోచించండి మనకు మన రాబోయే తరాలకు పూర్తిగా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మెట్టు గంగారాం బిసీ సంఘం అధినేత మెదక్ జిల్లా.






