6 July, 2026 | 8:56 PM

Breaking News

సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   కొబ్బరితోట నరికివేత... పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా   •   ఇసుక వేలం.. రూ.2.76 లక్షల ఆదాయం..   •  

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం

05-05-2026 08:13 PM

* ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్

అచ్చంపేట: రైతులు లాభసాటి పంటలతో పాటు.. నిరంతర ఆదాయం లభించే పంటల సాగుపై దృష్టి సారించాలని ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్ ఆకాంక్షించారు.  ఆయిల్ పంప్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం లభిస్తుందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ)లో భాగంగా మంగళవారం అచ్చంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో డివిజన్ పరిధిలోనీ రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపు.. ప్రత్యామ్నాయ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఉద్యాన అధికారి చంద్రశేఖర్ రైతులకు ప్రధాన మంత్రి కృషి ధన్ ధన్య యోజన కింద అందుబాటులో ఉన్న వివిధ పథకాలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు దీర్ఘకాలిక ఆదాయం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ సౌకర్యాల గురించి వివరించారు. దీంతోపాటు కూరగాయ పంటలు సాగు చేస్తున్న రైతులు తమ సాగు అనుభవాలను సదస్సులో ఇతర రైతులతో పంచుకున్నారు. సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆర్గానిక్ రైతు ఊర్మిళమ్మ రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మరింత దృష్టి సారించాలని సూచించారు.