అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని జమేదారు బంజర పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 1 వ తేదీన మృతి చెందిన అనాద మహిళ మృతదేహానికి సోమవారం గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ ఆద్వర్యంలో అంత్యక్రియలు జరిపారు. దమ్మపేట పోలీసులు అనాద మృతదేహాన్ని గత మూడు రోజుల క్రితం అశ్వారావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
మృతదేహానికి సంబందించిన బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాదగా గుర్తించిన పోలీసులు మందలపల్లికి చెందిన గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ సహాయాన్ని కోరారు. కాగా మందలపల్లి పంచాయతీ కార్యదర్శి, పోలీసుల సమక్షంలో గౌతమ బుద్ద స్వచ్చంద సేవా సంస్ధ నిర్వాహకులు అనాద మృతదేహానికి అంత్యక్రియలు జరిపారు. కార్యక్రమంలో సంస్ధ వ్యవస్ధాపకులు పాలడుగుల అబ్బులు, ఎస్ కె అజీమ్, రొయ్యల కుమార్, జెసిబి సోము తదితరులు పాల్గొన్నారు.






