ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం
* బిజెపి మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి
ముస్తాబాద్,(విజయక్రాంతి): డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం దేశ రాజకీయాల్లో జాతీయవాదానికి బలమైన పునాదులు వేసిన మహానేత, దేశ సమైక్యత కోసం కృషి చేసిన ముఖర్జీ పోరాటపటిమ చిరస్మరణీయమని పేర్కొన్నారు.1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించి దేశభక్తి భావజాలానికి రాజకీయ రూపమిచ్చిన ఆయన జమ్మూ–కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుడని కొనియాడారు.వారి ఆశయాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.






