6 July, 2026 | 9:30 PM

Breaking News

కొబ్బరితోట నరికివేత... పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా

06-07-2026 08:29 PM

 - అర్ధరాత్రి పంటను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదు.

 - వివాదాలు ఉంటే చట్టపరంగా చూసుకోవాలి.. దౌర్జన్యాలు తగవు..

 - పేద, గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదు.

 - అధికారులు వెంటనే విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలి

దమ్మపేట,(విజయ క్రాంతి): మండల పరిధిలోని నల్లకుంటలో బొగ్గం శివ, మల్లా కమల, గోళ్ళ సీతారావమ్మ, గోళ్ళ వెంకటేశ్వర్లు, గట్ల సర్వేశ్వరరావు, జంగాల వెంకటేశ్వరరావుకు చెందిన 273/1 సర్వే నెంబర్ల భూముల్లో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడి  కొబ్బరి మొక్కలను నరికివేశారు. విషయం తెలుసుకున్న అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు సోమవారం సంఘటన జరిగిన స్థలాన్ని సందర్శించి ధ్వంసమైన కొబ్బరి తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులను అడిగి విషయం తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ భూవివాదాలు ఏమైనా ఉంటే చట్టపరంగా, కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ఇలా చీకటి మాటున, అర్ధరాత్రి వేళల్లో రైతుల పంటను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. రైతులను బెదిరింపులకు గురిచేయడం, వారిపై అక్రమ కేసులు బనాయించడం ఏమాత్రం సరికాదన్నారు. రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, రికార్డుల ప్రకారం అసలైన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను ఎవరైనా ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.