కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు
05-05-2026 08:15 PM
కోదాడ,(విజయక్రాంతి): కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ పూర్తి చేసుకున్న ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థినులకు మంగళవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ మాట్లాడుతూవిద్యార్థినులు తమ భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి తల్లితండ్రులకు, కళాశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని ఆకాంక్షించారు.






