6 July, 2026 | 9:38 PM

Breaking News

గిరిజన దర్బార్ లో గిరిజనులు అందించిన ప్రతి విన్నపాన్ని సత్వరమే పరిష్కరించాలి   •   శివంపేట గ్రామానికి నిధుల మంజూరుపై హర్షం!   •   ప్రమాద బాధిత కుటుంబాలకు వసుధ ఫౌండేషన్ చేయూత   •   ముత్తారం ఎంపీడీవోగా ప్రవీణ్ కుమార్ నియామకం   •   భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •  

జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

06-07-2026 08:31 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): జర్నలిస్టు స్థలం ఆక్రమించిన వారిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ఎంసీపీఐయు పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ... బెల్లంపల్లి నియోజకవర్గంలోని సమస్యలను అన్నింటిని ప్రభుత్వం వద్దకు చేరవేర్చే జర్నలిస్టులకూ కేటాయించిన స్థలాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చదును చేయటం బాధాకరమన్నారు. ఈ ఘటనను సంబంధిత అధికారులు చూస్తూ ఉండటం చాలా విడ్డురంగా వుందినీ విమర్శించారు.

అధికార,అంగ బలంతో ఎక్కడపడితే అక్కడ స్థలాలు కబ్జా చేయడం అనేది బెల్లంపల్లి నియోజకవర్గంలోనే అక్రమార్కులకు సాధ్యపడుతుందనిన్నారు. ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా పని చేసే జర్నలిస్టుల స్థలాలు కబ్జా చేయడం సరికాదని, ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో స్పందించి న్యాయంగా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాలను వారికే చెందే విధంగా చూడగలరని ఎం సి పి ఐ యు పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని యెడల జర్నలిస్ట్ లు చేసే ప్రతి ఉద్యమంలో వారికి బుజం కలిపి స్థలాలు ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య, జిల్లా కార్యదర్శి దుర్గం లక్ష్మి, సబ్బని రాజశేఖర్, జాడి రాజకుమార్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.