6 July, 2026 | 9:27 PM

Breaking News

భిక్కనూరులో అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో ఫిర్యాదు   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన   •   ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •  

సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి

06-07-2026 08:56 PM

- ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మారింది

- ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.

- నూతన భవనాన్ని వెంటనే ప్రారంభించాలి

- సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు.

బూర్గంపాడు,(విజయక్రాంతి): మండల కేంద్రమైన బూర్గంపాడు లోని 30పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాథమిక వైద్యశాలగా మారిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రేపాకుల శ్రీనివాస్, మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, పాండవుల రామనాథం,రాయల వెంకటేశ్వర్లు, వై అప్పారావు బృందంగా వెళ్లి ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులను, వైద్య సిబ్బందిని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బూర్గంపాడు 30పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన బిల్డింగ్ వెంటనే ప్రారంభించాలని కోరారు.

సమస్యల నిలయంగా ప్రభుత్వ ఆసుపత్రి మారడంతో వైద్యం అందక పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. డిప్యుటేషన్ పై వచ్చిన డాక్టర్లతో, సిబ్బందితో వైద్యం అందించడం విచారకరమని తెలిపారు. పర్మినెంట్ డాక్టర్లను వైద్య సిబ్బందిని నియమించాలని అన్నారు . అదేవిధంగా నూతనంగా నిర్మిస్తున్న బిల్డింగులు నాణ్యత లోపాలను పర్యవేక్షించడంలో అధికారులు చెందారని దానివల్లే 2026 జనవరిలో అందుబాటులోకి రావాల్సిన నూతన బిల్డింగు నేటికీ అందుబాటులోకి రాకపోవడం జరిగిందని విమర్శించారు.వరద ముంగిట్లో మునిగి ఉన్న  ఆసుపత్రికి చుట్టూ ప్రహరీ గోడ నూతనంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఎక్స్ రే ,స్కానింగ్ విభాగాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.మండల ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.