శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించిన పర్యాటక శాఖ అధికారులు
22-07-2026 05:59 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రమునకు పర్యాటక ప్రాంతముగా అభివృద్ధి కొరకు 13 కోట్లు మంజూరూ చేస్తూ తెలంగాణ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయుట జరిగింది. ఈ విషయమై ఉపేందర్ రెడ్డి ఎక్జిక్యూటీవ్ డైరెక్టర్ పర్యాటక శాఖ వారు మట్టపల్లి మహాక్షేత్రమునకు విచ్చేసి పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా వివిధ నిర్మాణములు చేయుటకు స్థల పరిశీలన చేశారు.
అనంతరం దేవస్థాన అనువంశక ధర్మకర్తలు, మట్టపల్లి గ్రామ సర్పంచ్ సూచనలు సలహాలు తీసుకున్నారు. తదుపరి శ్రీ స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. దేవస్థాన అర్చకలు వేదమంత్రములతో ఆశీర్వచనము చేసిన తదుపరి దేవస్థాన అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్ లు శేషవస్త్రముతో సత్కరించారు.






