22 July, 2026 | 7:29 PM

మోడల్ స్కూల్లో సోషల్ ఆడిట్

22-07-2026 06:25 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలో బుధవారం సమగ్ర శిక్ష సమితి సోషల్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించడం జరిగింది. తరగతి గదులను పరిశీలించడంతోపాటు మంజూరైన నిధుల వినియోగంపై పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమై పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ అనురాధ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శోభ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.