భద్రకాళి అమ్మవారికి చామంతి పుష్పార్చన
27-03-2026 02:23 AM
వరంగల్, మార్చి 26 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి పసుపు రంగు చామంతి పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. గురువారం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.




