సీఎం ఆదేశాలకు దిక్కేది?
స్నేహిత హిల్స్‌లో లోపించిన పారిశుద్ధ్యం
కొన్ని నెలలుగా రోడ్లపైనే మురుగునీరు పరువు
సమస్యను పట్టించుకోని రాజేంద్రనగర్ సానిటేషన్ విభాగం అధికారులు
రాజేంద్రనగర్, మార్చి 26 (విజయక్రాంతి): సానిటేషన్ విషయంలో సీఎం ఆదేశాలను జిహెచ్‌ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు లెక్కచేయడం లేదు. రోడ్లు మరియు శానిటేషన్ విషయంలో ఫిబ్రవరి 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి జిహెచ్‌ఎంసి సర్కిల్ డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రోడ్లు శుభ్రం లేకపోతే స్పాట్లోనే అధికారులను సస్పెండ్ చేస్తా అంటూ హెచ్చరించినప్పటికీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలోని సానిటేషన్ అధికారులు మాత్రం స్పందించడం లేదు.
పాత బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్14వ డివిజన్ పరిధిలోకి వచ్చే స్నేహిత హిల్స్ లో డ్రైనేజీ లీకై మురుగు నీరు రోడ్డుపైనే గత కొన్ని నెలల నుండి ప్రవహిస్తుంది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అధికారులు ఎలాంటి మరమ్మత్తు చర్యలు తీసుకోవడం లేదు. టీఎస్ పి ఎస్ జంక్షన్ 100 ఫీట్ల రోడ్డు రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం పక్కనుండి స్నేహిత హిల్స్ లోకి వచ్చే దారిలో ఇండియన్ పబ్లిక్ స్కూల్ ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకై పెద్ద ఎత్తున మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తుంది.
ఈ రోడ్డుపై వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే ..పెద్ద మొత్తంలో దుర్గంధం వెదజల్లడంతో పాటు దాదాపు 25 అప్టిమెంట్ల నుండి వందల ఇండ్ల నుండి మురుగు నీరు వస్తుంది.ఈ మీరు కారణంగా దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. రోడ్డుపైనే మురుగునీరు ప్రవహించడంతో వాహనాలు మురు గునీటిపైన వెళ్లడం వల్ల ఒకపక్క బురద .. మరోపక్క శిధిలమైన బురద రోడ్డు కాలనీవాసులను అనారోగ్యానికి. ఇబ్బందులకు గురిచేస్తుంది..
దుర్వాసన భరించలేకపోతున్నాం:
కేకే మూర్తి స్నేహిత హిల్స్
స్నేహిత హిల్స్‌లో డ్రైనేజీ ధ్వంసమై రోడ్డుపైనే మురుగునీరు ప్రవ హిస్తున్నడంతో వందలకొద్దీ ఇళ్లల్లో నుండి వచ్చే మురుగునీటి దుర్వాసనను భరించలేకపోతున్నాం. చాలా కాలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యను పరిష్కరించడం లేదని స్నేహితుల హిల్స్ కాలనీకి చెందిన కోట్ర కృష్ణమూర్తి తెలిపారు. కాలనీవాసులు కోట్లకు రూపాయల ను టాక్స్ ల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పటికీ సౌకర్యాలను కల్పించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ కాలనీ లో మంచినీటి సౌకర్యాన్ని. డ్రైనేజీలను .రోడ్లను అభివృద్ధి చేయాలని కేకే మూర్తి కోరారు.




