27 March, 2026 | 4:07 AM

మొదలైన రాములోరి కల్యాణ సందడి

27-03-2026 02:22 AM

మంగపేట, మార్చి 26 ( విజయక్రాంతి): మండలంలోని కమలాపురంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రాములో రి కళ్యాణ సందడి మొదలైంది. శ్రీ రామనవమి పండుగ సందర్భంగా నిర్వహించనున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలలో భా గంగా గురువారం ఉదయం ఆలయ ప్రధా న అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యు లు, అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యులు అధ్వర్యంలో సుప్రభాతం, సేవకా లం విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచ కలశ స్థాపన, పంచామృతాలతో అభిషేక మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం స్వామి, అమ్మ వారి విగ్రహాల అ లంకరణ, ఆరగింపు, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్య కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ఎదుర్కో ళ్ళు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కోరుకొప్పుల శంకర్, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.