27 March, 2026 | 4:06 AM

మిల్స్ కాలనీ ఎస్‌ఐ సస్పెండ్

27-03-2026 02:24 AM

వరంగల్, మార్చి 26 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. సురేష్ ను విధుల నుంచి సస్పెండ్ చే స్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. ఎస్‌ఐ పై ఇటీవల వచ్చిన ఆరోపణలపై అధికారులు నిర్వ హించిన విచారణలో రుజువు కావడంతో ఎస్‌ఐ ని సస్పెండ్ చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.