27 March, 2026 | 3:09 AM

భద్రాచలం రామాలయ అభివృద్ధికి 586 కోట్లు

27-03-2026 01:16 AM
  1. మూడు విడతలుగా నిధులు మంజూరు
  2. తొలి విడతగా 351 కోట్లు.. జీవో జారీ 
  3. నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా పనులకు శంకుస్థాపన
  4. రాములోరి కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (విజయక్రాంతి): దక్షిణ అయోధ్యగా బాసి ల్లుతున్న భద్రాచలం రామాలయం అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ. 586 కోట్లు మంజూరు చేసింది. తొలి విడతగా రూ.351 కోట్లు నిధులను మంజూరుచేస్తూ పరిపాలన ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిధులతో రామాలయం పునరాభివృద్ధి, పునరుజ్జ్జీవ పనులకు మూడు దశ ల్లో నిధులు మంజూరుచేసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధంచేశారు.

2024 మార్చి 11న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలం పర్యటన సందర్భంగా రామాలయం అభివృద్ధి, భద్రాచలం పట్టణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలన్న ఆదేశాలతో దేవాదాయశాఖ రామాలయం అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ సిద్ధంచేసి, సీఎం ఆమోదంతో మొదటి దశ పనులకు పరిపాలన ఉత్తర్వులు జారీచేశారు.

శుక్రవారం శ్రీరామనవమి సంద ర్భంగా సీతారాముల కల్యాణంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆనవాయితీగా ము త్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించేందుకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గత ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయం నిర్లక్ష్యానికి గురవడంతో కోట్లాదిమంది భక్తులు మెచ్చేలా ముఖ్యమం త్రి నిధులు మంజూరు చేయడం పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. 

ముస్తాబైన భద్రాద్రి..

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలిచే శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో ఘనం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిఅయ్యాయి. భద్రాచలం పట్టణం సర్వాంగ సుంద రంగా ముస్తాబైంది. ఈ పర్వదినం సందర్భంగా శుక్రవారం వేడుకలు నిర్వహించేందుకు దేవస్థానం రంగం సిద్ధంచేసింది. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుంచి ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల్లో నవమి నాటికి పూర్తి దశకు చేరుకుంటా యి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో భక్తు లు ఈ పండుగను అత్యంత సంప్రదాయబద్ధం గా నిర్వహించుకోవడం ఆనవాయితీ.

స్వామివారి కల్యాణం కోసం మిదులా స్టేడియం సిద్ధమైంది. 28న స్వామివారికి పట్టాభిషేక మహో త్సవం కన్నుల పండుగ జరగనుంది. ఎండ తీవ్ర త దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు, తాగునీరు, మజ్జిగ సౌకర్యాలను కల్పించారు. కల్యా ణానికి హాజరుకాని వారికోసం, ఆర్టీసీ తలంబ్రా లు నేరుగా ఇంటికి పంపించే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయడంతో పాటు దేశవ్యాప్తంగా భ ద్రాచలానికి తరలివచ్చే లక్షలాదిమంది భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్‌లను ఏర్పాటు చేశారు. 

అభిజిత్ లగ్నంలో కల్యాణం 

మిధుల స్టేడియంలో లక్షలాదిమంది భక్తుల సమక్షంలో శుక్రవారం శ్రీరాముడు ఉదయం 11.06 నుంచి మధ్యాహ్నం 1.31 గంటల మధ్య అభిజిత్ లగ్నంలో వేదమంత్రోచ్ఛారణల నడు మ సీతమ్మ వారి మెడలో మంగళసూత్రధారణ చేయనున్నారు. ఏటా ఈ వేడుకల కోసం భక్తు లు వేయి కళ్లతో ఎదురుచూడటం పరిపాటి.