27 March, 2026 | 3:08 AM

దావోస్ పర్యటనలతో 2.19 కోట్ల పెట్టుబడులు

27-03-2026 01:19 AM
  1. విపక్షాలు చేస్తున్న విషప్రచారం సరికాదు
  2. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయింపు 
  3. ఎంవోయూలు, పెట్టుబడుల అంశాలపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధం 
  4. ‘టీ సేవలు ఇతర రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్ 
  5. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి) : మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన దావోస్ పర్యటనలతో రాష్ట్రానికి రూ. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయ ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. దావోస్ పర్యటన ల్లో భాగంగా మొత్తం 44 ఎంవోయూల ను ప్రభుత్వం కుదుర్చుకున్నదని తెలిపారు. పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విషప్రచారం సరికాదని, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

స్వార్థ రాజకీయాల కోసం మాపై కోపంతో చేసే ఈ తప్పుడు ప్రచారం రాష్ట్రానికి మంచిది కాదని, ఇకకైనా వైఖరి మార్చుకోవాలని సూచించా రు. తను పర్యవేక్షించే శాఖల్లో పారదర్శకతకు కట్టుబడి ఉన్నానని, రాబోయే రోజుల్లోనూ అందుకు అనుగుణంగానే నడుచుకుంటామని స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయం లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు.

2024 దావోస్ పర్యటనలో 18 ఎంవోయూల ద్వారా రూ. 40,232 కోట్ల పెట్టుబడులు, 2025 దావోస్ పర్యటనలో 26 ఎంవోయూల ద్వారా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. రూ.81,800 కోట్ల పెట్టుబడులతో 6 కంపెనీలకు భూముల కేటాయించామని తెలిపారు. ఈ భూముల కేటాయిం పుతో ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం లభించిదన్నారు. మరో 3 కంపెనీలకు రూ.30 వేల కోట్ల పెట్టుబడుల కోసం భూముల గుర్తించామని పేర్కొన్నారు.

నిజామాబాద్ ఐటీ టవర్‌లో 11 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, 681 సీట్ల సామర్థ్యం గల ఈ ఐటీ టవర్‌లో ప్రస్తుతం 276 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. ఏ రాష్ట్రాభివృద్ధికైనా ఐటీ, పరిశ్ర మల రంగాలు ప్రధాన భాగస్వాములని, వాణి జ్యం, వ్యాపారం ప్రభుత్వానికి మూల స్థంభాలన్నారు. వాటి ప్రభావం ప్రత్యక్షంగా కనిపిం చకపోయినా పరోక్షంగా ఉంటుందన్నారు.  

శ్వేతపత్రం విడుదలకు సిద్ధం..

ఎంవోయూలు, పెట్టుబడులు, కంపెనీలు తదితర అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని, స్వల్పకాలిక చర్చకు కూడా వెనుకడుగేయబోమని అన్నారు. ఏం చేసినా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని, దావోస్ పర్యటనలపై విపక్షాల దుష్ప్రచారం సరికాదన్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు వరల్డ్ ఎకానమిక్ ఫోరం వార్షిక సదస్సు ఒక గొప్ప ప్లాట్ ఫామ్ అన్నారు.

ఐసోలేషన్‌లో ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావని, డిఫరెంట్ ప్లాట్ ఫాంలపై పరిశ్ర మల ఏర్పాటుకు మన దగ్గర ఉన్న అనుకూలతలు, అవకాశాలు, ప్రభుత్వం తరఫున అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొ స్తారని వివరించారు. ఎంవోయూ అంటే బేస్ అగ్రిమెంట్ అని, ప్రతి ఎంవోయూ గ్రౌండింగ్ కావడానికి సమయం పడుతుందన్నారు. ఆ విషయంపై అవగాహన లేని కొందరూ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

దావోస్ పర్యటనలు, ఇతర సందర్భాల్లో చేసుకున్న ప్రతి ఎంవోయూను గ్రౌండింగ్ చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, ఈ అంశంలో తమ నిబద్ధతపై ఎవరికీ సందేహం అవసరం లేదని స్పష్టంచేశారు. టైర్‌వి టైర్ పట్టణాలు, నగరాల్లో పారిశ్రామికాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే జిల్లా కేంద్రంగా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు.

పదేళ్ల తర్వాత ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మా ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. కేంద్ర మైనింగ్ పాలసీతో సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయని, దీనిని అధిగమిస్తే ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో సిమెంట్ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీని ప్రారంభించుకోబోతున్నదని వెల్లడించారు. మారుతున్న టెక్నాలజీ కారణంగా ఐటీ రంగంలో భిన్న పరిస్థితులు నెలకొన్నాయని, దీంతో ఆయా జిల్లాల్లోని ఐటీ టవర్స్‌లో ఉన్న కంపెనీల నిర్వహణలో యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

ఈ కంపెనీలకు మరో మూడేళ్ల పాటు ఫ్రీ రెంటల్ అవకాశం కల్పించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయా ఐటీ టవర్స్‌లో అన్ని బిల్లులు టీజీఐఐసీ ద్వారా చెల్లిస్తున్నామని తెలిపారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీలో మన ‘టీఆ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఓ రోల్ మోడల్ గా నిలిపామన్నారు. టీ ద్వారా తెలంగాణ అద్భుతమైన సేవలు అందిస్తున్నదని, ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి సింధియా ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు.