2 September, 2026 | 5:13 PM

పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పణ

02-09-2026 | 04:05pm

గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు 

గణపురం సెప్టెంబర్ 02 (విజయ క్రాంతి): శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా గణపురం మండల కేంద్రంలో గ్రామస్థులు పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బుధవారం బోనాలను సమర్పించారు. మొదట భక్తులు గ్రామ దేవతల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రదక్షిణల అనంతరం నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా కుటుంబాలు చల్లగా ఉండాలని పాడిపంటల సమృద్ధిగా పండాలని పోచమ్మ తల్లిని భక్తులు వేడుకున్నారు.