నవీన్ ఉల్ హక్‌కు పిలుపు
రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ
భారత్‌తో సిరీస్‌కు అఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
కాబూల్, ఆగస్టు 24: భారత్‌తో జరగను న్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కెప్టెన్‌గా తనను తాను నిరూపించుకోవడానికి భారత్తో జరిగే మ్యాచ్ ఇబ్రహీం జద్రాన్కు ఓ గొప్ప అవకాశం.
2028 టీ20 ప్రపంచకప్కు ముందు జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు గెలవాలని ఇబ్రహీం జద్రాన్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.భుజం గాయం కారణంగా చాలా కాలం పాటు జట్టుకు దూరమైన స్టార్ పేసర్ నవీన్-ఉల్-హక్ రీ ఎంట్రీ ఇచ్చాడు.ఫిట్నెస్ సమస్యల కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన ఈ స్పీడ్స్టర్ భారత పర్యటనకు ఎంపికయ్యాడు.అనుభవజ్ఞుడైన ఆల్రౌండర్ గుల్బదిన్ నైబ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు.
గుల్బదిన్ నైబ్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయడంతో పాటు మంచి బౌలింగ్ ఆప్షన్గా నిలుస్తాడు.దేశీయ క్రికెట్లో సంచలనం సృష్టిస్తున్న యువ వికెట్ కీపర్-బ్యాటర్ నూర్ రహ్మాన్కు తొలిసారిగా జట్టులో చోటు దక్కింది. స్పిన్ బౌలింగ్ లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 13, 15, 17వ తేదీల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు :
ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(కెప్టెన్), నూర్ రహమాన్(వికెట్ కీపర్), సెడీకుల్లా అటల్, డార్విష్ రసూలి. అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్ నబీ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నాన్గ్యాల్ ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, అబ్దుల్లా అహ్మద్జాయ్, నవీన్ ఉల్ హక్.






