8 May, 2026 | 2:23 AM

నిమ్స్‌లో ఒబెసిటీ క్లీనిక్

08-05-2026 01:18 AM

పంజాగుట్ట,మే7(విజయక్రాంతి): నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఒబెసిటీ క్లీనిక్ తో ఊబకాయస్తులకు ప్రయోజనం చేకూరుతుందని సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అన్నారు. ఇనిస్టిట్యూట్‌లోని ఎండోక్రినాలజీ విభాగం ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన క్లీనిక్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. మెడికల్ సూపరిం టిండెంట్ డాక్టర్ సుమన, ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రా ర్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి శాంతివీర్, వైద్యులు, మీడి యా రిలేషన్ ఆఫీసర్ సత్య గౌడ్ పాల్గొన్నారు.