అప్రమత్తతతోనే దొంగతనాల నివారణ
08-05-2026 01:20 AM
కూకట్‌పల్లి, మే 7( విజయ క్రాంతి): జువెలరీ షాపులలో దొంగతనాల నివారణలో భాగంగా జువెలరీ షాప్ యజమానులకు నిర్వహకులకు అవగాహన కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఏర్పాటు చేశారు.
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి లలిత జ్యువెలర్స్‌లో బంగారు ఆభరణాల దుకాణాలలో దొంగతనాలు జరగకుండా సిబ్బందికి తీసుకోవలసిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కేపీహెచ్ బి డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవి మాట్లాడుతూ, అప్రమత్తత ద్వారానే దొంగతనాలను నివారించగలమని, షాపులలో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పానిక్ బటన్ అలారంను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.






