ఎన్టీఆర్ డబుల్ సర్‌ప్రైజ్!
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో భారీ యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కల్యాణ్‌రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉండగా, ప్రస్తుతానికి ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు. ఇటు ఫ్యాన్స్, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇదే ఏడాది విడుదలవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు మేకర్స్ తాజాగా ఒక అప్డేట్‌తో డబుల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫస్ట్ గ్లింప్స్, సినిమా రిలీజ్ డేట్‌ను తెలియజేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను మే 20న రిలీజ్ చేయబోతున్నామని, అది ఒక పవర్‌ఫుల్ సినిమాటిక్ వరల్డ్‌ను పరిచయం చేస్తుందని పేర్కొన్నారు. ఇక ఈ సినిమా 2027, జూన్ 11న శుక్రవారం థియేటర్లలోకి రానుందంటూ రిలీజ్ డేట్‌ను సైతం అధికారికంగా ప్రకటించింది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ సహా పలు భాషల్లో విడుదల కాబోతోందీ చిత్రం. ఈ మేరకు టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఎన్టీఆర్ నీడలాంటి ఓ లుక్‌లో కనిపించడం సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకొని, స్లిమ్‌గా కనిపించబోతున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రపీ, చలపతి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






