31 August, 2026 | 12:57 PM

పదో తరగతి విద్యార్థి దుర్మరణం!

31-08-2026 12:08 PM

చదువు ఒత్తిడితో మియాపూర్‌లో విషాదం

శేరిలింగంపల్లి,ఆగస్టు 31 (విజయక్రాంతి): మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో పదో తరగతి చదువుతున్న (16) ఏళ్ల విద్యార్థి మరణించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. చదువు సరిగా సాగడం లేదనే ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు.మృతుడు మల్లికార్జున.మియాపూర్‌లోని సుభాష్ చంద్రబోస్ నగర్‌లో నివసిస్తున్న పెయింటర్ కుమారుడు. స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.

ఇటీవల రోజుల్లో చదువు విషయంలో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆయన ప్రాణాలు తీసుకున్నాడు.కుటుంబ సభ్యులు గమనించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.చిన్న వయసులోనే కుమారుడిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.పరీక్షల ఒత్తిడి, చదువు భయం విద్యార్థుల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి ఆందోళన కలిగిస్తోంది.