థాయ్‌లాండ్‌లో ఈఎన్‌ఈ రిపీట్ టీమ్
22-04-2026 02:01 AM
‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం విజయం సాధించటమే కాక యువ ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ మూవీ సీక్వెల్‌గా ‘ఈఎన్‌ఈ రిపీట్’ రూపొందుతోంది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్, అభినవ్ గోమఠం, వెంక టేశ్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తుండగా, వీరితో కొత్తగా శ్రీనాథ్ మాగంటి చేరారు. ఈ ప్రాజెక్టుకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ నెల పాటు కొనసాగుతుందని తెలియజేస్తూ సెట్ నుంచి టీమ్ విడుదల చేసిన ఫోటో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుం డగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.






