బెల్ట్ షాపులకు నోటీసులు జారీ
05-08-2026 09:22 AM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామీ గ్రామంలో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులనిర్వాహకులకు పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు, గ్రామ పంచాయతి పరిధిలో బెల్ట్ షాప్ ను చట్ట విరుద్ధంగానిర్వహిస్తున్నారని పంచాయతీ దృష్టికి రావడంతో సర్పంచ్ ఉప్పు లక్ష్మీ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలో ఎలాంటి బెల్ట్ షాపు లను నిర్వహించవద్దని గ్రామ పంచాయతీ సమావేశంలో తీర్మానించారని తెలిపారు.






