ఓటరు జాబితా సవరణపై నిర్లక్ష్యం వద్దు.. తల్లోజు ఆచారి పిలుపు
ఆమనగల్లు ఆగస్టు 5 (విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్ ) ప్రక్రియను నాయకులు, కార్యకర్తలు ఎంతో బాధ్యతాయుతంగా తీసుకోని విజయవంతం చేయాలని బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు.దరఖాస్తుల పునఃసమర్పణ ఎన్యూమరేషన్ దరఖాస్తులను తిరిగి సమర్పించడానికి ఆగస్టు 10వ తేదీ వరకు అవకాశం దగ్గర పడుతుండడంతో ప్రతి అర్హులైన ఓటరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.దరఖాస్తుల నమోదులో వారికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నారు.బూత్ స్థాయిలో బీ ఎల్ ఓ లు, బీ ఎల్ ఏ లు, మరియు సూపర్‌వైజర్లు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం పర్యవేక్షణ జరపాలి. ప్రతి అర్హులైన ఓటరు వివరాలు జాబితాలో సరిగ్గా నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు.






