టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ గా దుర్గం శేఖర్ నియామకం
ఆదిలాబాద్ నేతకు కాంగ్రెస్ అధిష్టానం గుర్తింపు..
న్యూఢిల్లీలో నియామక పత్రం అందించారు...
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. దుర్గం శేఖర్
ఉట్నూర్, (విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, దుర్గం ట్రస్ట్ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు చేపట్టిన దుర్గం శేఖర్‌ను టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. నేతకానీ మహర్ సమాజానికి చెందిన దుర్గం శేఖర్ విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్ భావజాలంతో అనుబంధం కలిగి, విద్యార్ధి దశ నుండే నానా పటేల్ కళాశాలలో చదువుతున్న సమయంలోనే ఎన్ఎస్‌యూఐలో చేరి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సర్గీయ రామచంద్ర రెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వివిధ జిల్లా స్థాయి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన విశ్వసనీయత, పార్టీ పట్ల నిబద్ధత కారణంగా డీసీసీ కార్యవర్గంలో కీలక బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధిగా కూడా సేవలందించారు. ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అలాగే యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు నాయకత్వంలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
ఈ నేపథ్యంలో ఇందిరా భవన్ న్యూఢిల్లీలో జరిగిన ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ జాతీయ సమావేశంలో ఎస్సీ డిపార్ట్మెంట్ నేషనల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ చేతుల మీదుగా దుర్గం శేఖర్ నియామక పత్రం అందుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఎస్సీ డిపార్ట్మెంట్ బలోపేతానికి సంబంధించి నేతలకు దిశా నిర్దేశం చేశారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ నాయకులతో కలిసి కూర్చొని వారిలో నూతన ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి ఈ పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని, సీనియర్ నాయకుల సలహాలతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
పదవి రావడానికి సహకరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క, రాష్ట్ర దళిత మంత్రిర్యులు వేవేక్ వెంకట స్వామి. వడ్లురి లక్ష్మణ్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, నరేష్ జాదవ్, కాంగ్రెస్ ఇంచార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, బోథ్ కాంగ్రెస్ ఇంచార్జి ఆడే గజందర్ ఇతర నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ గౌరవాన్ని తన రాజకీయ గురువైన సీ.ఆర్.ఆర్ గారికి అంకితం చేస్తున్నానని దుర్గం శేఖర్ పేర్కొన్నారు.






