మారెళ్లపాడు ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టం
బాహుబలి మోటార్ అమరికకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శ్రీకారం
అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని సీతారామపురం వద్ద నిర్మితమవుతున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులు తుది దశకు చేరుకోగా, ప్రాజెక్టులో కీలకమైన బాహుబలి మోటార్ అమరిక పనులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆరు గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12 వేల ఎకరాలకు, రైట్ కెనాల్ ద్వారా 10 చెరువులను నింపి దాదాపు 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఈ టి. వెంకటేశ్వరరావు, డీఈఈ కె. శ్రీనివాస్, ఏఈలు, ఎంఈఐఎల్ సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, గాదె కేశవరెడ్డి, ఆవుల రవి, వేములపల్లి రమేష్, ఉసా అనిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భూరెడ్డి వెంకటరెడ్డి, తుక్కాని మధు, గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు.






