5 August, 2026 | 10:34 AM

ఆడవారిని అడ్డుపెట్టుకొని కేసులు పెట్టడం హేయమైన చర్య

05-08-2026 09:49 AM

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు భాస్కర్ 

గుండాల, (విజయక్రాంతి): ఆడవారిని అడ్డుపెట్టుకొని కేసులు పెట్టడం హేయమైన, నీచమైన సంస్కృతి అని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మండల నాయకులు గడ్డం వీరన్న మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావుపై అక్రమ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తూ ఒక గిరిజన నాయకుడిపై తప్పుడు కేసులు బనాయించడం నీచ సంస్కృతి అని అన్నారు.

జిల్లాలో పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావుకు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేకనే తప్పుడు కేసులలో ఇరికించారని ఆరోపించారు. మండల నాయకుల నుండి రాష్ట్ర నాయకుల వరకు రోజు ఏదో ఒక చోట తప్పుడు కేసులలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాలని చూస్తున్నారని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు కేసులలో ఇరికించే సంస్కృతిని మానుకోవాలని హితవు పలికారు. రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేనని తెలుసుకొని పార్టీ నాయకులను కేసుల్లో ఇరికించడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతం పంపాలని దురుద్దేశం ఉందని అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పనులు చేసేవారు మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్యాయ సమితి అధ్యక్షులు మాజీ మోకాళ్ళ వీరస్వామి, అధికార ప్రతినిధి టి రాము, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ బుచ్చి రాములు, నాయకులు రాంబాబు, ప్రమోద్, రమేష్, కిరణ్, ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.