5 August, 2026 | 10:34 AM

బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

05-08-2026 09:46 AM

మెట్ పల్లి, (విజయక్రాంతి): పాఠశాల విద్యార్థుల ప్రయాణ భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో జగిత్యాల జిల్లా రవాణా శాఖ(Jagtial District Transport Department) ఆధ్వర్యంలో మెట్‌పల్లిలో స్కూల్ బస్సు డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలకు మంగళవారం సమగ్ర రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.జగిత్యాల జిల్లా రవాణా అధికారి సందాని మహమ్మద్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా డిఎస్పీ రాములు, రవాణా అధికారి  సందాని మహమ్మద్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, ఎం. సాయిచరణ్, షేక్ రియాజ్ లు డ్రైవర్లు పాటించాల్సిన కీలక భద్రతా నియమాలను వివరించారు.

ప్రతి స్కూల్ బస్సులోనూ ఖచ్చితంగా ఒక అటెండెంట్ ఉండాలి.స్కూల్ బస్సు నడపడానికి డ్రైవర్‌కు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం తప్పనిసరి.ప్రతిరోజూ ప్రయాణం ప్రారంభించే ముందు టైర్లు, బ్రేకులు, మరియు ఇతర నియంత్రణ వ్యవస్థలను డ్రైవర్లు ఖచ్చితంగా తనిఖీ చేయాలి.ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు.ఈ అవగాహన సదస్సులో మెట్‌పల్లి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు నూట ఇరవై మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, వివిధ పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు పాల్గొని, విద్యార్థుల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.