ఒక్క బీసీ గురుకులం కూడా ఇవ్వలేదు
- అదనంగా 119 మంజూరు చేయాలి
- ఎంపీ ఆర్.కృష్ణయ్య
ముషీరాబాద్, జూలై 16(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 119 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకుల సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం బీసీ ప్రజాసమితి అధ్యక్షుడు భీమ్ రాజు ఆధ్వర్యంలో తెలుగు సంక్షేమ భవన్ ముట్టడించారు.
ఈ సందర్భంగా ఎంపీ కృష్ణయ్య మాట్లాడు తూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున్న పోరాటం చేసి 290 బీసీ గురుకుల పాఠశాలలు సా ధించారన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకు లం కూడా మంజూరు చేయలేదన్నారు.
అదనంగా 119 బీసీ గురుకులాలు మం జూరు చేయాలన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సి. రాజేందర్, విద్యార్థులు, వారితల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






