11 March, 2026 | 11:21 PM

పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన నోడల్ టీం అధికారులు

11-03-2026 09:33 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన గరిడేపల్లి లోని ప్రాథమిక పాఠశాలను జిల్లా నోడల్ టీం బుధవారం పరిశీలించింది. జిల్లా వ్యాప్తంగా గుణాత్మక విద్య పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా పర్యవేక్షణ కమిటీ పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించారు.

పాఠశాలలోని రికార్డ్స్,మధ్యాహ్న భోజనం, గ్రంధాలయం, ఫార్మేటివ్, సమ్మటివ్ పరీక్షా ఫలితాలు, సిసి ఈ రిపోర్ట్స్ వారు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. వివిధ అంశాల వారీగా పాఠశాల పనితీరును నోడల్ టీం పరిశీలించిన అనంతరం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చత్రునాయక్, నోడల్ టీం అధికారి కె గోపిరెడ్డి, నోడల్ సభ్యులు చారు గుండ్ల రాజశేఖర్, రఘునాయక్, ప్రధానోపాధ్యాయులు హైమావతి, ఉపాధ్యాయులు కిషోర్ బాబు,దీప్తి తదితరులు పాల్గొన్నారు.