మాచాపూర్‌లో బడిబాట కార్యక్రమం
ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన ఉపాధ్యాయులు...
సిద్దిపేట రూరల్, జూన్ 11: బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రధానోపాధ్యాయులు జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులను కలిసి విద్యార్థుల చేరికలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం, అల్పాహారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, షూస్ తదితర సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయుల బోధనతో పాటు అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. ప్రైవేట్ పాఠశాలలపై అధిక ఖర్చు భారం మోసే బదులు ప్రభుత్వ పాఠశాలలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఏపీసీ చైర్మన్ లక్ష్మి, ఉపాధ్యాయులు రాధిక, రాజయ్య, వసంత పాల్గొన్నారు.






