ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ వద్దు
05-07-2026 01:14 AM
- పీఆర్సీసీ, డీఏ, పెండింగ్ బిల్లులు విడుడల చేయాలి
- ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్‌కు తపస్ వినతి
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) కోరింది. ఈ మేరకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్‌కు శనివారం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓడ్నాల రాజశేఖర్, తెల్కపల్లి పెంటయ్య, నాయకులు హనుమంత రావు, భాస్కర్ వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఇక పీఆర్సీసీ, డీఏ, పెండింగ్ బిల్లులను విడుడల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈమేరకు వారు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే కలెక్టరేట్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.






