నన్ను ఆపేటోడే పుట్టలేదు
రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడను
- ఆయనలా పది పార్టీలు మారలే
- నా చావు, నా పుట్టుక బీజేపీలోనే..
- రేవంత్‌కు ముందుంది మొసళ్ల పండుగ
- రాహుల్ ఈ జన్మలో ప్రధాని కాలేడు
- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ‘పొలిమేర దాటకుండా నన్ను ఆపేవాడు ఇంకా పుట్టలేదు. ముఖ్యమంత్రి తాటాకు చప్పుళ్లకు భయపడేందుకు నేనేం కేసీఆర్‌ను కాదు’ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యా లయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ లాగా నేను పది పార్టీలు మారలేదని.. నా పు ట్టుక, చావు రెండూ బీజేపీలోనే అని స్పష్టం చేశారు.
తాను ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసని, నువ్వు ఎంత రెచ్చగొట్టినా తొందరపడనని, అన్నింటికీ సమయ మే సమా ధానం చెబుతుందన్నారు. రాష్ట్రానికి రావాలంటే తనకు రేవంత్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆయనకు ముందుంది మొసళ్ల పం డుగ అని హెచ్చరించారు. తన ఇంటి ఎదుట ధర్నా చేస్తానని బెదిరిస్తున్నాడని.. హామీలు నెరవేర్చకపోతే దళితులు, బీసీలు రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట ధర్నాలు చేస్తారని హెచ్చ రించారు. ముఖ్యమంత్రి రాజకీయ నైరాశ్యం లో ఉన్నారని విమర్శించారు.
ఆయన మా టలు కొండలు, కోనలు దాటుతున్నాయని, ఇచ్చిన హామీలు సెక్రటేరియట్ దాటడం లేదని ఎద్దేవా చేశారు. రేవంత్‌కు ఎంతోకాలం లేదని, ఇంకో రెండున్నర ఏళ్లు మాత్ర మే ఉందన్నారు. రాహుల్‌గాంధీ ఈ జన్మలో ప్రధాని కాలేడని, కావాలంటే తన వ్యాఖ్యలను రాసి పెట్టుకోవాలని కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తలు సైతం ఎవరికి భయపడరని, తలవంచ రని స్పష్టం చేశారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పశ్చిమ బంగాల్‌లో ఉంటారని తెలిపారు.
20 తేదీన ఉదయం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒక్క రోజు కౌంట్‌డౌన్ పేరుతో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని, పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. సమావేశంలో పార్టీ ఇంచార్జ్ అభయ్ పాటిల్, ఎం పీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నగేష్, డీకే అరుణ, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చించారు. ‘విద్యార్థి భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు.






