గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి
మానకొండూరు,(విజయక్రాంతి): మానకొండూర్ మండలం గట్టు దుద్దెనపల్లి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్ గా గంగుల రాంరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే సంఘం డైరెక్టర్లుగా బాకారపు సమ్మయ్య, కంకణాల రామ్మోహన్ రెడ్డి, పి.కనక రాజేశం, చిలుముల అంజలీదేవి, కనకం ఎల్లయ్య, యాళ్ల సుధాకర్ రెడ్డి, గోస్కుల భూమయ్య, మంద వీరయ్య, పెద్ది శ్రీశైలం, మహ్మద్ రజియా, రెడ్డి రవి ప్రమాణం చేశారు. అనంతరం గంగుల రాంరెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ యమునారాణి, ముఖ్యకార్యనిర్వహణాధికారి మడ్డి తిరుపతి, కె.ప్రవీణ్, మాజీ జడ్పీటీసీ, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మానకొండూర్, తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, బండారి రమేశ్, పార్టీ నాయకులు కరివేద సత్యనారాయణ రెడ్డి, కనకం కుమార్, మాతంగి సహదేవ్, మర్రి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
దేవంపల్లి విండో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన రొంటాల
మానకొండూర్ మండలం దేవంపల్లి సింగిల్ విండో చైర్మన్ గా పచ్చునూరు గ్రామానికి చెందిన రొంటాల లక్ష్మారెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డైరెక్టర్లుగా కొమ్మిడి సత్తిరెడ్డి, బాలగోని మల్లయ్య, సోమిడి మల్లయ్య,, పిట్టల సంపత్, గోపు స్వప్న, వరాహాల చారి, గాడిచెర్ల కొమురయ్య, గుండా ప్రశాంత్, రేవెల్లి ఎల్లయ్య, వెల్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, నల్లెంగి ఐలయ్య, ఆరెల్లి నర్సమ్మ ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా రొంటాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సహకార సంఘ అభివృద్ధికి పారదర్శకంగా పనిచేస్తామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు, విత్తనాలు, రుణాలు, ఇతర సహకార సేవలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘం అభివృద్ధికి డైరెక్టర్లు, సభ్యులు, రైతులతో సమన్వయంగా పనిచేస్తూ ప్రతి రైతుకు సహకార సంఘం సేవలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ముఖ్యకార్యనిర్వహణాధికారి మల్లికార్జున్ రెడ్డి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం అశోక్, మాతంగి సహదేవ్, మర్రి కుమారస్వామి,గొల్లెన కొమురయ్య, తోట శ్రీనివాస్, కనకం అశోక్, ఎడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.






