7 July, 2026 | 8:45 PM

సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం

07-07-2026 07:25 PM

మాజీ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి

జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ సర్ కార్యక్రమంపై మాజీ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాసరెడ్డి మంగళవారం విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ స్థానిక ప్రజలు ఓటర్ జాబితాలో తమ పేరు చిరునామా ఇతర వ్యక్తిగత వివరాలను పరిశీలించుకొని అవసరమైతే మార్పులు చేర్పులు తొలగింపుల కోసం సర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు అమూల్యమైనదని స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పన లో సర్ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబం సర్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఓటర్ వివరాలను ధ్రువీకరించుకోవాలని ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటరు తన బాధ్యతను నిర్వర్తించాలని తెలిపారు.