7 July, 2026 | 8:45 PM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు

07-07-2026 07:29 PM

చౌటుప్పల్,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం నారాయణపురం మండలం బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ పార్టీల వివిధ గ్రామాల సర్పంచులు గ్రామాల అభివృద్ధి కొరకై  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు శాసనసభ్యులు నివాసం వద్ద సర్పంచులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికై పార్టీలకు అతీతంగా నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగినది. వివిధ గ్రామాల సమస్యలపై మాట్లాడుతూ సూచనలు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అంకిరెడ్డిగూడెం గ్రామ సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్, దండు మల్కాపురం సర్పంచ్ గిరికంటి నిరంజన్ గౌడ్ , అల్లాపురం సర్పంచ్ టేకుల మంజుల దిలీప్ రెడ్డి, కంకణాల గూడెం సర్పంచ్ పాలెం వీరేష్ గౌడ్ ,   అల్లం దేవి చెరువు సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ వివిధ గ్రామ సర్పంచులు ఎమ్మెల్యే ను కలవడం జరిగింది.