7 July, 2026 | 8:35 PM

ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07-07-2026 07:17 PM

తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ  మంద కృష్ణ మాదిగ 61వ జన్మదిన వేడుకలను తలమడుగు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకులు అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం మంద కృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 32 సంవత్సరాలుగా సామాజిక న్యాయం, మాదిగల హక్కుల పరిరక్షణ రిజర్వేషన్ సాధన కోసం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు ఆయన సేవలు మాదిగ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గోంటిముక్కుల ప్రేమేందర్ శివ అరవింద్ రూపేందర్ అశోక్ రాజు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు