06-02-2026 12:57:31 PM
కేసీఆర్ చేసిందేం లేదు
హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Nizamabad MP Arvind) పాల్గొన్నారు. ఈ నేథ్యంలో ఎంపీ అర్వింద్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పదేళ్ల పాటు చేసిందేం లేదన్నారు. కేంద్ర నిధులు మళ్లించారు, పేదలకు ఇల్లు కట్టించలేదని ఆరోపించారు. రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకే కాదు.. గల్లీ ఓట్లలోనూ బీజేపీని ఆదరించాలని కోరారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని తెలిపారు.