23 June, 2026 | 3:12 PM

ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్

23-06-2026 02:07 PM

ఏకకాలంలో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు 

ఉమ్మడి జిల్లాలో కలకలం 

కామారెడ్డి, జూన్ 23,(విజయక్రాంతి): అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడులు నిజామాబాద్(Nizamabad Excise Superintendent) జిల్లాలో కలకలం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఏసీబీ అధికారులు మంగళవారం ఏకకాలంలో పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ గౌడ్(ACB DSP Chandrashekhar Goud) ఆధ్వర్యంలో ఏసీబీ అధికారుల బృందం మల్లారెడ్డి ఇంటిలో సోదాలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయం తోపాటు ప్రగతి నగర్ లోని మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారుల బృందం ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ సూపర్డెంట్(Excise Superintendent) కార్యాలయంలోని పలు పైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డి ఇంటిలో సైతం విలువైన పత్రాలను, రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాదులోని ఈఎస్ మల్లారెడ్డి ఇంటిలో శోధాలు నిర్వహించడమే కాకుండా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు పగడ్బందీగా దాడులు నిర్వహించి ఎక్సైజ్ సూపర్డెంట్ మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం సృష్టించింది.