సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి
23-06-2026 02:35 PM
బోథ్ జూన్ 23( విజయక్రాంతి): సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని తీర్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది సమావేశంలో దీర్ఘ కాలిక పంట రుణాలు మంజూరి చేయాలని చర్చించారు. అంతేగాక స్థలాలు ఉన్న చోట గోదాముల నిర్మాణం చేపట్టాలని తిరుమణించారు సమావేశంలో సహకార సంఘం ఉపాధ్యక్షులు రాజేశ్వర్ డైరెక్టర్లు చట్ల ఉమేష్ లో లపు పోశెట్టి నారాయణ లు పాల్గొనగా నివేదికను సీఈవో బారే భూషణ్ చదివి వినిపించారు.






