23 June, 2026 | 4:26 PM

కనబడుటలేదు.. ఆచూకీ తెలిస్తే సమాచారం అందించండి

23-06-2026 03:12 PM

బెజ్జూర్ జూన్ 23 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని లంబడిగూడ గ్రామానికి చెందిన సకినాల భీమయ్య (38 సం॥లు), బిసి–మున్నూరు కాపు అనే అతను కనిపించడం లేదు. వృత్తిరీత్యా కోడిగుడ్ల వ్యాపారి, గత ఐదు నెలలుగా మతిస్థిమితం సరిగా లేక ఇంటి వద్దనే ఉంటుండగా, ఈనెల  18-06-2026 గురువారం ఉదయం సుమారు 05:00 గంటల సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లు, పరిచయస్తుల ఇళ్లు సమీప గ్రామాలలో విస్తృతంగా వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు.

తప్పిపోయిన సమయంలో అతను సబ్బు రంగు టీ-షర్ట్, కాకి రంగు ప్యాంట్ ధరించి ఉండగా, చామనచాయ వర్ణంతో సుమారు 5.5 అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడు. ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సార్తాజ్ పాషా తెలిపారు . ఎవరైనా కనిపించినా లేదా అతని ఆచూకీ తెలిసినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాల్సిన సెల్ నెంబర్లు: 8712670541,8712670512 ఈ నెంబర్లకు సమాచారం అందించాలని వారు కోరారు.