23 June, 2026 | 3:11 PM

పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి

23-06-2026 02:08 PM

ముత్తారం జూన్ 23 (విజయక్రాంతి):  ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో సోమవారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి ప్రధాన రహదారులన్నీ చెరువులా మారి పొంగిపొర్లుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన చిన్న వర్షానికి గ్రామంలోకి ప్రవేశించే గానే ప్రధాన రహదారి పై వర్షం నీరు పిండుకొని చెరువు ను తలపిస్తుంది. దీంతో గ్రామంలోని ప్రజలు ఈ వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రధాన రహదారి పై ఉన్న వర్షం నీటిని తొలగించాలని, మురికి కాలువలను శుభ్రం చేసి వీటిని పంపించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.