ఆయిల్ పామ్ రైతులకు నష్టం: మంత్రి తుమ్మల
న్యూఢిల్లీ: కొత్తగూడెం విమానాశ్రయం(Kothagudem Airport) విషయమై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని(Union Minister Rammohan Naidu) కలిశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao ) ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 10-15 రోజుల్లో ఫీజిబిలిటీ కమిటీని పంపి పరిశీలిస్తామని రామ్మోహన్ చెప్పినట్లు మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు కృషి చేయాలని కోరామన్నారు. దిగుమతులపై సుంకం తగ్గించడం వల్ల ఆయిల్ పామ్ రైతులకు నష్టం కలుగుతోందని వెల్లడించారు.
దిగుమతి చేసుకుంటున్న ఎడిబుల్ ఆయిల్ లో కొంత వెసులుబాటు ఇవ్వాలని కోరారు. దిగుమతి సుంకం పెంచి పామాయిల్ రైతులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 2-3 ఏళ్లలో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాకుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఆయిల్ దిగుమతుల భారాన్ని తగ్గిస్తామని చెప్పామన్నారు. గతంలో మాదిరిగానే ఆయిల్ దిగుమతుల సుంకం 44 శాతం ఉంచాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన యూరియా, డీఏపీ తెలంగాణకు రాలేదని సూచించారు. సేకరించిన జొన్న, మొక్కజోన్నలను కేంద్రం కోనుగోలు చేయాలని మంత్రి తుమ్మల కేంద్రాన్ని కోరారు.






