29 June, 2026 | 2:10 PM

జీవితం.. వంద మీటర్ల పరుగుపందెం కాదు.. మన ఓపికకు పరీక్ష

29-06-2026 01:06 PM

రీల్స్, షార్ట్స్ చూసి నిర్ణయాలు తీసుకోవద్దు

హైదరాబాద్: ఘట్‌కేసర్‌లోని VBITలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో కాంక్లేవ్ నిర్వహించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్(BJP National President Nitin Nabin) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నల్సార్, ఐఎస్ బీ, హెచ్ సీయూ, కేయూ, ఓయూ, ఐఐటీ, ఐఐఐటీఎన్ఐటీ, ఇఫ్లూ, బిట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయాల్లో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారని కేయూ విద్యార్థి శ్రీజ ప్రశ్నించారు. చిన్న వయసులోనే అనుకోకుండా రాజాకీయాల్లో వచ్చానని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సూచించారు. రాజకీయాల్లోకి వచ్చాక నా భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డానని తెలిపారు.

ఏ పని చేసినా నాదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నానని వివరించారు. జీవితం.. వందమీటర్లు పరుగుపందెం కాదు.. మన ఓపికకు పరీక్ష అన్నారు. అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే నా బలమని సూచించారు. వేగంగా లక్ష్యాలు చేరాలనే ఆరాటంతో నేటి యువత ఉందని చెప్పిన నితిన్ నబీన్ ఏ పనినైనా ఓపిక, నిలకడ, శక్తితో చేసినప్పుడే ఫలితాలు వస్తాయని వివరించారు. నేటి యువత ఎప్పుడూ వాస్తవికత గుర్తించి పనిచేయాలని పిలుపునిచ్చారు. రీల్స్, షార్ట్స్ చూసి ఎవరూ నిర్ణయాలు తీసుకోవద్దని హెచ్చరించారు.

జీవితంలో నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకోండన్నారు. వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకొండి.. పని మొదలు పెట్టండని తెలిపారు. యువత.. రాజకీయాల్లోకి రావాలి.. వచ్చాక ఏం చేస్తారో స్పష్టత ఉండాలన్నారు. గతంలో తమ హక్కుల గురించి ప్రజలకు అంతగా తెలిసేది కాదన్న నితిన్ నబీన్ సోషల్ మీడియా వచ్చాక ప్రజల్లో చైతన్యం పెరిగిందని వెల్లడించారు. హక్కులు, విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలన్నారు. పార్టీలు, నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తుంచుకుంటారని నబీన్ పేర్కొన్నారు.